మాల‌మ‌హానాడు జాతీయ అధ్య‌క్షుడిగా న‌త్తా

Published: 01-03-2022

విజ‌య‌వాడ‌:  పీవీ రావు మాల‌మ‌హానాడు జాతీయ అధ్య‌క్షుడిగా న‌త్తా యోనారాజు ఎన్నిక‌య్యారు. విజ‌య‌వాడ‌లోని గాంధీన‌గ‌ర్‌లోనున్న ప్రెస్‌క్ల‌బ్‌లో సోమ‌వారం మాల‌మ‌హానాడు రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలోని ఆ సంఘ జిల్లా నాయ‌కులంద‌రూ యోనారాజును జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు. తొలుత సంఘ నాయ‌కులంద‌రూ అంబేడ్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం నూత‌నంగా ఎన్నికైన యోనారాజును ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ద‌ళిత స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిరంత‌రం పోరాడ‌తాన‌న్నారు. ప‌లువురు దళిత నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఆయ‌న‌ను అభినందించారు.