ద‌ళిత స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి

Published: 25-01-2022

తాడేప‌ల్లి:  ద‌ళిత స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని పీవీ రావు మాల‌మ‌హానాడు రాష్ట్ర అధ్య‌క్షుడు న‌త్తా యోనారాజు పేర్కొన్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా యోనారాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని మాల‌ల అభ్యున్న‌తికి కృషి చేయాల‌ని సీఎంను కోరామ‌న్నారు. దీనిపై సీఎం కూడా సానుకూలంగా స్పందించార‌న్నారు.