కలెక్టర్‌ను కలిసిన ఐక్యవేదిక నాయకులు
Published: 18-12-2021

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను దళిత గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన కలిశామని, ఈ సందర్భంగా బుద్ధభగవానుని ఫొటోను బహుకరించామని తెలిపారు. అనంతరం పలు దళిత సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షుడు డోకుబుర్ర భద్రం, ఉపాధ్యక్షులు మాచగిరి రాంబాబు, ఎస్‌కే హుసేన్, బీసీ నాయకులు ఉమాశంకర్, దివాకర్, సెక్రటరీ సాపే సుధాకర్, ట్రెజరర్ కొండేపూడి రవికాంత్, జాయింట్ ట్రెజరర్ అమలదాసు, నూకరాజు, జాయింట్ సెక్రటరీ సిద్ధాంతపు రాజు, బోనగిరి, బాలభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Share this on your social network: