177వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర
Published: 01-06-2018

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర 177వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం నరసాపురం నియోజకవర్గంలో సాగుతున్న ఆయన పాదయాత్ర నేడు పాలకొల్లు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఈరోజు ఉదయం నరసాపురం శివారు నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి చిట్టివరం క్రాస్, రాజోల్ క్రాస్, దిగమర్రు, పెద్ద గరువు క్రాస్ మీదుగా పాలకొల్లు చేరుకుంటారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

Share this on your social network: