ఇచ్ఛాపురం నుంచి పలాస బయలుదేరనున్న జనసేన పోరాట యాత్ర .........

Published: 21-05-2018

శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోరాట యాత్ర జిల్లాలో రెండో రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఇచ్చాపురంలో పార్టీ కార్యకర్తలతో పవన్ భేటీ కానున్నారు. పోరాట యాత్రలో భాగంగా 11.30 గంటలకు ఇచ్ఛాపురం నుంచి పలాస బయలుదేరనున్నారు. అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సోంపేట రైతులను కలవనున్నారు. ఈరోజు రాత్రికి పవన్ పలాసలోనే బస చేయనున్నారు.