యడియూరప్ప ఆదేశంతో చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు
Published: 27-07-2019

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు కొన్ని గంటల ముందే యడియూరప్ప పాలనపై దృష్టి సారించారు. ఆపద్ధర్మ ము ఖ్యమంత్రి కుమారస్వామికి తొలి షాక్ ఇ చ్చారు. జూలై నెలలో చేపట్టిన బదిలీలు, కొ త్తగా మంజూరు చేసిన పనులను నిలిపి వేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్‌భాస్కర్‌కు సూచించడంతో ఆయన ఆదేశాలు జారీ చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు యడియూరప్ప సీఎంగా ప్రమాణం చేయగా మధ్యాహ్నం 2గంటలలోగానే ఉత్తర్వులు అన్ని జిల్లాల కలెక్టర్‌లకు పంపారు. ప్ర త్యేకించి మైసూరు, మండ్య, హాసన్ జిల్లాల్లో పలు గ్రాంట్ల మంజూరుకు సంబంఽ దించి ఒక్కవేటున నిలిపివేసినట్టయ్యింది. కుమార స్వామి సర్కార్‌లో బదిలీలపై పెద్ద దుమారం రేగింది. ప్రజాపనులశాఖ మంత్రి రేవణ్ణ అన్ని శాఖల్లోనూ ఉద్యోగులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. చివరకు బలనిరూ పణకు 24 గంటల ముందు కూడా బదిలీల ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Share this on your social network: