సానుభూతి కోసం పాకులాడుతున్నారు
Published: 17-07-2019

అమరావతి: నేడు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీట్ల కేటాయింపుపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం తలెత్తింది. రూల్స్ ప్రకారం అసెంబ్లీలో సీట్ల కేటాయింపు జరిగిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని చంద్రబాబు వివాదం చేయాలని చూస్తున్నారని జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబు సానుభూతి కోసం పాకులాడుతున్నారన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి అయినా రూల్స్ పాటించాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. మీరు తక్కువ మంది ఉన్నా మాట్లాడే అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కదాన్ని టీడీపీ సభ్యులు వక్రీకరిస్తున్నారని జగన్ తెలిపారు.

Share this on your social network: