సీఎంను చేస్తే కాంగ్రెస్‌కు 1,500 కోట్లు
Published: 27-03-2019

తండ్రి మరణం తర్వాత తనను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రె్‌సకు రూ.1500 కోట్లు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడ్డారని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కశ్మీరు మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని జగన్ అప్పట్లో తనకు స్వయంగా చెప్పారన్నారు. ఇలాంటి డబ్బు మనిషికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. మంగళవారం ఆయన టీడీపీ అధ్యక్షు డు చంద్రబాబుతో కలిసి కడపలోని ఆల్మా్‌సపేటలో మైనారిటీ ప్ర చార సభలో ప్రసంగించారు. ఆ తర్వాత ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు సభల్లోనూ పాల్గొన్నారు.
‘‘జగన్ తండ్రి వైఎస్ కాంగ్రెస్ తరఫున సీఎం అయ్యారు. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ సందర్భంగా నాతో జగన్ చెప్పిన గుర్తుకొస్తున్నాయి. కాంగ్రెస్ త నకు సీఎం పదవి ఇస్తే పార్టీకి రూ.1500 కోట్లు ఇస్తామన్నారు. జగన్‌ది ధనంతో ఏదైనా సాధించవచ్చనే మనస్తత్వమని నాకు అప్పుడే అర్థమైంది’’ అని ఫరూక్ పేర్కొన్నారు. అటువంటి జగన్‌కు ఓటు వేస్తే ఏమవుతుందో అర్థం చేసుకోవాలని సూచించారు. ‘‘జగన్‌కు అంత డబ్బు ఎక్కడిది.? ఎలా సంపాదించి ఉంటారు? చంద్రబాబుకు, జగన్‌కు మధ్య తేడాను మీరు గుర్తించాలి. చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించి, అందరి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే నాయకుడు! అటువంటి నేతను గెలిపించి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మీదే’’ అని ముస్లింలకు ఫరూక్ పిలుపునిచ్చారు. చంద్రబాబు వల్ల మిమ్మల్ని కలుసుకునే అదృష్టం కలిగిందన్నారు. ‘‘మన అభివృద్ధి, సంక్షేమం కోరుకునే, తపన ఉన్న వ్యక్తి చంద్రబాబు. అటువంటి వ్యక్తిని గెలిపించండి. మీకు సమృద్ధిగా తాగు, సాగునీరందిస్తారు. మరోసారి నేను కడపకు వస్తా! అప్పుడు మిమ్మల్ని అడిగి నీరు తాగుతా.. టీడీపీని గెలిపించండి. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయండి’’ అని ఫరూక్ ముస్లింలకు ఫరూక్ అబ్దుల్లా విన్నవించారు.

Share this on your social network: