జనసేనలోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం

Published: 03-02-2019

విశాఖపట్నం: తాను జనసేనలోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పార్టీ మారే సమస్యే లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తన గెలుపులో పవన్ పాత్ర ఉంది కానీ ఆయన వల్లే గెలిచాననడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న వారు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదని, రాజకీయాలపై ఇంకా అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. ఏపీ ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని, అలాంటిది మోదీ ఏ మొహం పెట్టుకొని విశాఖ వస్తున్నారని మంత్రి గంటా ప్రశ్నించారు.