ఇక అమరావతిలోనే ఉంటా : పవన్‌

Published: 22-12-2018
 జనసేనకు ఎన్నికల క్రాంతి సమయం ఆరంభం కానుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చే సంక్రాంతి నుంచి జనసేన ఎన్నికల బరిలోకి దూకే క్రాంతి సమయం ఆరంభం కానుంది. అందుకే జనవరి 1 నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తారు. ఇక నాయకులందరికీ అనుక్షణం అమరావతిలో అందుబాటులో ఉంటా. ఇప్పటికే జనసైనికుల కవాతు ధ్వనితో ఆంధ్ర రాష్ట్రం పరవళ్లు తొక్కుతోంది. రండి.. గెలిచి కొత్త తరాన్ని నిలబెడదాం.. నిలిచి కొత్త బావుటా ఎగరేద్దాం. కలసి కొత్త శకాన్ని సృష్టిద్దాం’ అని శుక్రవారం ట్విటర్‌లో పిలుపిచ్చారు.
 
క్రైస్తవ సమాజానికి అండగా జనసేన ఉంటుందని ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేత రావెల కిశోర్‌బాబు క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేశారు. క్రైస్తవులకు అన్నివేళలా మేలు కలగాలని ఆకాంక్షించింది.