వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే
Published: 07-12-2018

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో గురువారం ‘ఇంటింటా బీజేపీ’ కార్యక్రమంలో పాల్గ్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన సాయంకంటే ఎక్కువగానే చేసిందన్నారు. తల్లికాంగ్రెస్, పిల్లకాంగ్రెస్‌లతో జతకట్టిన పార్టీ టీడీపీ అని కన్నా ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని మోదీని నమ్మించి పంచన చేరిన సీఎం చంద్రబాబు మోసం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రైల్వేజోన్, కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణం, కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ పనులు అన్నీ కేంద్రం పూర్తిచేస్తుందని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Share this on your social network: