మానసిక వికలాంగురాలిపై అత్యాచారయత్నం
Published: Wednesday May 30, 2018

మండలంలోని బేతాళపాడు పంచాయతీ పరిధిలోని పంతులు తండాకు చెందిన మానసిక వికలాంగురాలిపై ఓ యువకుడు అత్యాచారయత్నా నికి ప్రయత్నించిన సంఘటనపై జూలూరుపాడు పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయింది. ఎస్ఐ ఇళ్ళా రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో మానసిక వికలాంగురాలైన యువతి (21) తల్లికి కడుపులో నొప్పి రావడంతో తండ్రి స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉంది. తల్లిదండ్రులు ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకుని ఇంటికి రాగా మండలంలోని గుండ్లరేపు గ్రామానికి చెందిన లావుడ్యా రమేష్ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. దీంతో వారు ఆ యువతిని విచారించగా రమేష్ తనపై అత్యాచారానికి యత్నించాడని తెలిపింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
