నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
Published: Monday March 11, 2019

నాలుగేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా గురజాల మండలంలో ఆదివారం ఉదయం ఈ దారుణం జరిగింది. పీఎ్‌సఐ నాగేంద్ర తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు నర్సరీ విద్యార్థిని. ఆదివారం సెలవు కావటంతో ఇంటి వద్ద ఆడుకుంటుండగా ముత్తన నాగిరెడ్డి(45) ఆమెను తన ఇంటిలోకి తీసుకెళ్లి తలుపులు వేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు నాగిరెడ్డి ఇంటి తలుపులు కొట్టారు. మద్యం మత్తులో ఉన్న నాగిరెడ్డి తలుపులు తీయ గా, లోపల మంచంపై చిన్నారి ఉంది. వారు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయ గా, చిన్నారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
