యువతిపై యాసిడ్ దాడి
Published: Thursday March 07, 2019

ప్రేమను తిరస్కరించిందని యువతిపై యాసిడ్ దాడి చేశాడో ఉన్మాది. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వేమకోటివారి వీధికి చెందిన శివశంకర్ అదే వీధికి చెందిన యువతిని కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. యువతి నో చెప్పడంతో బుధవారం రాత్రి ఆమెపై బాత్రూమ్ క్లీన్చేసే యాసిడ్పోశాడు. ఆమె మెడపై స్వల్ప గాయాలయ్యాయి.
