సత్తా చాటిన ఆంధ్రా బాక్సర్లు : జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటిలు

Published: Friday January 26, 2018

ఈ నెల 16 నుంచి 20 వరకు ఢిల్లిలో  జరిగిన జాతీయ స్థాయి  కిక్ బాక్సింగ్  పోటిలు మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన కిక్ బాక్సర్లు ప్రతిభ ప్రదర్శించారు  . రాష్రం లో వివిధ జిల్లాల నుండి హాజరైన  బాక్సర్లు 8 స్వర్ణ పతకాలు 12 రజత పతకాలు 16 కాంస్య పతకాలు సాధించారు . త్వరలొ నిర్వహించనున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ కి చెందిన టి దుర్గా ఎ పృద్వీరాజ్, ఎ హరి ఎంపికైనట్టు ఏపీ కిక్ బాక్సింగ్ అసోసియెషన్ అధ్యక్షుడు కరణంరెడ్డి నరసింగరావు తెలిపారు . అయితే ఈ పొటిలలో విశాఖ కు చెందిన బాక్సర్లు 3 స్వర్ణ పతకాలు 7 రజత 6 కాంస్య పతకాలు గెలుచుకొవడం హర్షణీయమన్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోచలు జి ఆనంద్ బాలు సునీల్ కుమార్ టీం మెనెజర్ సాంతి క్రీడాకారులను అభినందించారు .