సెల్ఫీలతో సాగిన జగన్ యాత్ర
Published: Tuesday November 27, 2018

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో రెండోరోజు సెల్ఫీలు, ముద్దులతో సాగిం ది. సోమవారం ఉదయం పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలంలోని విక్రంపురం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. నడుకూరు, వీరఘట్టం, ఎం.రాజపురం, చిదిమి, యు.వెంకంపేట గ్రామాల వరకు.. సుమారు 8 కిలోమీటర్ల మేర యాత్ర సాగించారు. దారి పొడవునా వైసీపీ కార్యకర్తలు, మహిళలు, యువతతో ఆయన సెల్ఫీలు దిగారు. మహిళల నుదిటిపై ముద్దులు పెడుతూ వారిని పరామర్శిస్తూ ముందుకెళ్లారు.
భారీ పోలీసు బందోబస్తు నడుమ యాత్ర కొనసాగింది. ఇదిలావుండగా తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో అక్కడ సీపీఎస్ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో టీడీపీ పెట్టిందని, సీపీఎస్ రద్దుచేస్తామన్న విషయాన్ని ఇక్కడ కూడా వైసీపీ మేనిఫెస్టోలో పెట్టాలంటూ ఉపాఽధ్యాయ సంఘాల ప్రతినిధులు జగన్‌ను కలసి వినతిపత్రం అందించారు. రెల్లి కులస్తులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ కులానికి చెందిన మహిళలు జగన్‌కు వివరించారు. అగ్రిగోల్డ్ బాధితులు కూడా జగన్‌కు వినతిపత్రం అందజేశారు.
