హోదా కోసమే పోరాటం: చలసాని

Published: Sunday November 25, 2018

 ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై పోరాటానికి ఢిల్లీ తరలిరావాలి’’ అని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. హోదా సాధన కోసం విద్యార్థి, యువసేన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగిన సమరయాత్ర బహిరంగ సభలో మాట్లాడుతూ ‘‘వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ఒక్కటైనా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ రాలేదు’’ అని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ అప్సర్‌, ప్రధాన కార్యదర్శి రంగన్న, పీడీఎ్‌సయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.