మాజీమంత్రి అరెస్టు
Published: Thursday January 25, 2018

పెద్దపల్లి: మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబును పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ గురువారం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. రైతు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి శ్రీధర్ బాబు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి మంథని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
