నేటితో ముగియనున్న శ్రీనివాస్ రిమాండ్
Published: Friday November 23, 2018

విశాఖపట్టణం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసులో నిందితుడైన శ్రీనివాసరావు రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియనుంది. నేడు విశాఖ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో శ్రీనివాసరావును పోలీసులు హాజరుపర్చనున్నారు. విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో శ్రీనివాసరావు అనే యువకుడు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే.
