వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం దహనం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. మండలంలోని కేసానుపల్లి ఎస్సీ కాలనీలో రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని బుధవారం కాల్చివేశారు. ప్రారంభోత్సవం జరగకుండానే ఇలా జరగడంతో స్థానికులు దిగ్ర్భాంతి చెందారు. గురజాల నియోజకవర్గం ఇన్చార్జి కాసు మహేష్‌రెడ్డి గ్రామానికి చేరుకొని, పరిశీలించారు. కావాలని కొంత మంది వ్యక్తులు ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడ్డారని ఆరోపించారు.
నిందితులను గుర్తించి, వారికి చట్టపరంగా కఠినమైన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. జడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి పర్యవేక్షణలో కేసానుపల్లి నుంచి పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీ నిర్వహించారు. గురజాల రూరల్ సీఐ నరసింహారావు, ఎస్ఐ అద్దంకి వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్కాడ్స్ వచ్చాయి. నిందితులను గుర్తించి, కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.
