పేలిన జిలిటెన్ స్టిక్స్...ఇద్దరికి గాయాలు
Published: Sunday November 18, 2018

పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం కొనంకి గ్రామంలోని పిల్లేరు వాగు వద్ద జిలిటెన్ స్టిక్స్ పేలడంతో ఇద్దరు యువకులు గాయపడ్డారు. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో జిలెటిన్ స్టిక్స్ వేసేందుకు ప్రయత్నించగా అవి చేతిలో పేలాయి. ఈ ఘటనలో విష్ణు, తిరుపతిరావులు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిలో ఓ యువకుడి రెండు అరచేతులు తెగిపడ్డాయి. స్థానికులు వెంటనే వారిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
