సెల్ఫీలకు హద్దులు..ప్రత్యేక గుర్తింపు కార్డులు
Published: Monday November 12, 2018

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో సోమవారం పునఃప్రారంభం కానుంది. మక్కువ మండలం మేళాపువలస క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన బస శిబిరం నుంచి ఉదయం 8:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. మేళాపువలస కాలనీ, శ్రీదేవీకాలనీ రోడ్డు, ములక్కాయవలస, కాశీపట్నం సెంటర్, పాపయ్యవలస గ్రామాల మీదుగా సుమారు 6 కిలోమీటర్లు యాత్ర సాగనుంది. కొయ్యానపేట వద్ద రాత్రి బస ఉంటుంది. విశాఖ విమానాశ్రయంలో ఆయ నపై దాడి జరిగిన నేపథ్యంలో యాత్రకు భద్రత పెంచారు. ఇప్పటి వరకూ కొద్ది మందితో రోప్‌పార్టీ మధ్య ఆయన నడిచే వారు. ఇకపై 50 మంది పోలీసులతో రోప్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు సాలూరు సీఐ సయ్యద్ ఆదివారం స్పష్టం చేశా రు. సెల్ఫీల విషయంలోనూ ఆంక్షలు పెట్టనున్నారు. దీంతో పాటు జగన్‌ను కలిసే వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. వీఐపీలకు ఎర్రరంగు గుర్తింపు కార్డు, జగన్‌తో పాటు ప్రజా సంకల్పయాత్రను అనుసరిస్తున్న వారికి నీలం రంగు గుర్తింపు కార్డు, పాదయాత్రలో సిబ్బందికి ఆకుపచ్చ గుర్తింపుకార్డు ఇవ్వనున్నారు.
సీఆర్పీఎఫ్ పోలీసులు పాద యాత్ర మార్గంలో ముందుగానే తనిఖీలు చేస్తారు. రోడ్ క్లియరెన్స్ పార్టీని ఏర్పాటు చేశారు. పాదయాత్రలో నిఘాకు డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. వీటితోపాటు బాడీవేర్ కెమెరాలను వినియోగించనున్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి ఆదివారం సాయంత్రం 6:30కి ఇండిగో విమానంలో విశాఖపట్నానికి వచ్చిన జగన్‌కు స్థానిక నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అయితే విమానాశ్రయం టెర్మినల్ భవనం లోపలకు వెళ్లేందుకు నలుగురికి మా త్రమే అనుమతి ఇచ్చారు. మాడుగుల ఎ మ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, వైసీపీ న గర అఽధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, గుడివాడ అమర్‌నాఽథ్ వెళ్లి జగన్‌కు స్వాగతం పలికారు.
