పనికి తగ్గ వేతనం చెల్లించని యాజమాన్యం
Published: Monday November 05, 2018

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.. ఇదీ.. సుప్రీం కోర్టు తీర్పు! ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎ్‌సఆర్టీసీ మాత్రం అందుకు భిన్నంగా వెళ్తోంది. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నామమాత్రంగా వేతనాలు చెల్లిస్తున్న ఆర్టీసీ... రెగ్యులర్ ఉద్యోగులను సైతం డబుల్ డ్యూటీల్లో శ్రమ దోపిడీకి పాల్పడుతోం ది.
ఇదీ పరిస్థితి!
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 11 వేలకు పైగా బస్సులు నడుపుతున్న ఏపీఎ్‌స ఆర్టీసీలో 53 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 22 వేల మంది డ్రైవర్లు, 18వేల మం ది కండక్టర్లు, ఇతర విభాగాల్లో మరో 7వేల మంది కార్మికులున్నారు. మెజారిటీ కార్మికులు తమకు పని గంటల్లేవని, ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అ న్ని డిపోల్లోనూ రోజూ 1500 వరకూ డ్రైవర్లు, 800 మంది కం డక్టర్లు డబుల్ డ్యూటీలు చేస్తున్నా.. రెట్టింపు వేతనం మాత్రం లభించడంలేదు. పనికి తగ్గ వేతనం ఇవ్వనందున, డబుల్ డ్యూటీ చేయబోమంటున్నా బలవంతంగా అధికారులు పంపిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఒక డ్రైవర్‌కు మినిమమ్ బేసిక్ పే రూ.13,700 ఉందనుకుంటే చట్టపరంగా డబుల్ డ్యూటీకి రూ.1,450 చెల్లించాలి. అదే 12,540 ఉన్న కండక్టర్ రూ.1,325 చెల్లించాలి. ప్రస్తుతం చాలా మంది డ్రైవర్లు రూ.20 వేలు తీసుకొంటున్న వారున్నారు. ఈ తేడాల తో సంబంధం లేకుండా డబుల్ డ్యూటీ తప్పనిసరిగా చేయాలంటూ రూ.350 మాత్రమే యాజమాన్యం చెల్లిస్తోంది.
అవుట్ సోర్సింగ్.. అడ్డగోలు దోపిడీ
ఏపీఎ్‌సఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కార్మికులు సుమారు 7వేల మంది వరకూ పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మందికి నెలకు రూ.7 వేల వేతనం కూడా అందడంలేదు. కార్మిక చట్టాల సిఫారసు ప్రకారం స్కిల్డ్, అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అనే మూడు విభాగాలో.. ఏ ఒక్కరికీ కనీస వేతనం రూ.12వేలకు తక్కువ ఉండదు. కానీ రూ.9 వేలు మించి ఎవ్వరికీ ఇవ్వడంలేదు. అందులో ఈఎ్‌సఐ అని, ఏజెంట్ కమీషన్ అంటూ కటింగ్‌లో పోతే చేతికి రూ.6వేల నుంచి రూ.7వేలు మాత్రమే అందుతోంది. పైగా ఈ ఉద్యోగాలకు కూడా రూ.15వేల నుంచి రూ.40వేల వరకు లంచాలు గుంజారన్న ఆరోపణలున్నాయి.
