సముద్రంలో కుప్పకూలిన ఇండోనేషియా విమానం
Published: Tuesday October 30, 2018

అది ఇండోనేషియా రాజధాని జకార్తాలోని సోకార్నో హట్టా అంతర్జాతీయ విమానాశ్ర యం.. స్థానిక కాలమానంప్రకారం ఉదయం 6 గంటలు.. లయన్ ఎయిర్(జేడీ 610)కు చెందిన విమానంలో 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు సిబ్బంది ఎక్కారు..పంకల్ పినాంగ్ నగరానికి వెళ్లేందుకు 6:20కి టేకాఫ్ అయ్యింది.. 7:20కి గమ్యస్థానం చేరుకోవాల్సి ఉంది.. కానీ, టేకాఫ్ అయున 13 నిమిషాల్లోనే అంటే 6:33కి విమానంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సంబంధాలు తెగిపోయాయి. మరుక్షణమే జావా సముద్రంలో కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న 189 మంది దుర్మరణం పాలయ్యారు. విమానంతో సంబంధాలు తెగిపోగానే అప్రమత్తమైన అధికారులు విమానం కోసం గాలింపు చేపట్టారు. హుటాహుటిన సముద్రంలోకి వెళ్లిన రెస్క్యూ సిబ్బందికి విమాన శకలాలు, ప్రయాణికుల వస్తువులు కనిపించాయి.

అతి తక్కువ ధరకే ‘లయన్’ గగనయానం
లయన్ ఎయిర్ ప్రైవేటు సంస్థ. 1999లో ప్రారంభించారు. ‘అందరికీ అందుబాటులో విమాన యానం’ ఆ సంస్థ నినాదం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల జాబితాలో అగ్రభాగాన ఉంది. రోజూ అంతర్జాతీయంగా, ద్వీప సమూహంలోని వివిధ ప్రాంతాలకు డజన్ల సంఖ్యలో విమానాలు నడుపుతోంది. వీటిలో బోయింగ్ 737ఎస్ విమానాలే ఎక్కువ. ప్రయాణికుల సంఖ్యాపరంగా దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ
