ఏపీలో మరోసారి ఐటీ దాడులు
Published: Thursday October 25, 2018

ఏపీలో మరోసారి భారీగా తనిఖీలు చేసేందుకు ఐటీ శాఖ సన్నద్ధమైంది. విశాఖలో ఇప్పటికే తనిఖీలు ప్రారంభంకాగా, విజయవాడ, గుంటూరు, నెల్లూరులోనూ సోదాలు చేసేందుకు ఐటీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. హెడ్‌క్వార్టర్స్ నుంచి ఆదేశాలు రాగానే రంగంలోకి దిగబోతున్నాయి. విశాఖలోని ఎంవీసీ కాలనీలోని అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి కొన్ని ఐటీ బృందాలు బయలుదేరి గాజువాకలోని సెజ్‌లోకి వెళ్లాయి. అందులోని ట్రాన్స్‌వరల్డ్ బీచ్ శాండ్ కంపెనీలో సోదాలు జరుపుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలోనే వేచి ఉన్న మరికొన్ని బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసేందుకు కాసేపట్లో బయలుదేరనున్నాయి.
