దసరా రోజు కణేకల్లులో విషాదం
Published: Saturday October 20, 2018

కుల వృత్తి చేసుకుంటూ కొడుకును కలెక్టర్ చేద్దామనుకున్న ఓ తండ్రి ఆశయానికి కన్నీళ్లే మిగిలాయి. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో చదువుతున్న కొ డుకు సెలవులకు ఊరికి వచ్చి ఈతకెళ్లి హె చ్చెల్సీలో గల్లంతయ్యాడు. గురువారం కణేకల్లు లో జరిగిన ఈ సంఘటనపై స్థానికులు తెలి పిన వివరాలివి. కణేకల్లుకు చెందిన మంగలి రామాంజినేయులు, వరలక్ష్మీ దంపతుల కుమారుడైన శివరాజ్‌కుమార్ (19) హైదరాబాద్‌లో ని ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవులకని గ్రామానికి వచ్చాడు. పండుగ రోజు మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉన్నాడు. అనంతరం మిత్రులతో కలసి హెచ్చెల్సీ కాలువలో ఈతకు వెళ్లాడు.
మిత్రులంతా సరదాగా కాలువలో ఈ తకొడుతుండగా శివరాజ్‌కుమార్‌కు ఆయాసం అధికమైంది. ఊపిరాడకపోవడంతో గమనించిన తోటి మిత్రులు ఎలాగోలా కష్టపడి కాలువ గట్టుకు చేర్చారు. అప్పటికే తీవ్ర ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న శివరాజ్‌కుమార్ మరలా పొ రపాటున కాలువలోకి జారడంతో గల్లంత య్యాడు. తోటి మిత్రులు ఎంత వెతికినా జాడ కనబడకపోవడంతో బంధుమిత్రులకు సమా చారం అందించారు.
స్థానికులు శివరాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం సాయంత్రం వరకు జాడ కానరాలేదు. రామాంజి నేయులుకు శివరాజ్‌తో పాటు కూతురు అంకిత ఉండగా, ఒక్కగానొక్క కొడుకు కాలువలో గల్లంతవడంతో వారి రోదనలు మిన్నంటాయి. మంగలి కులవృత్తి చేసుకుంటూ కొడుకును క లెక్టర్ చేద్దామని కష్టపడుతున్న తల్లిదండ్రులకు శివరాజ్ నీటిలో గల్లంతవడం తీరని వేదనను మిగిల్చింది. కాగా ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొన్నారు.
