పండగ రోజు కుటుంబానికి దూరంగా సీఎం
Published: Thursday October 18, 2018

శ్రీకాకుళం: తితలీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో రోజైన గురువారం పర్యటించనున్నారు. దీంతో ఆయన దసర పండగ రోజు కుటుంబానికి దూరంగా ఉన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలపై చంద్రబాబు సమీక్ష జరపనున్నారు.
తితలీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఈనెల 29వ తేదీలోగా పూర్తి చేయాలని చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్ బాధితులకు నష్టపరిహార చెక్కులను ఈనెల29నుంచి పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై శ్రీకాకుళంలో బుధవారం రాత్రి 10గంటలకు సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం, జిల్లాలోని అధికారులతో టెలికాన్షరెన్స్ నిర్వహించారు.
