బైక్‌ను ఢీకొన్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్...
Published: Monday October 15, 2018

పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఉప్పాడ రైల్వేగేటు వద్ద గత అర్ధరాత్రి ఓ ద్విచక్రవాహనాన్ని ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రైలు బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తోంది. ఈ ప్రమాదంతో రైలు 13 గంటలు ఆలస్యంగా నడుస్తోంది.
