మంత్రి సోమిరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
Published: Sunday October 14, 2018

శ్రీకాకుళం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. తితలీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆయన శ్రీకాకుళం జిల్లాకు వెళ్తున్నారు. అయితే... ఆయన ప్రయాణిస్తున్న వాహనం హరిపురం దగ్గర హైవేపై టైర్లు పేలి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో మంత్రి సోమిరెడ్డి పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం మరో వాహనంలో మందస గ్రామానికి బయలుదేరి వెళ్లారు.
