8, 9 తేదీల్లో మహిళా లెక్చరర్ల నిరవధిక దీక్షలు
Published: Thursday October 04, 2018

విజయవాడ: ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్ల సాధన పోరాటంలో భాగంగా ఈనెల 8, 9 తేదీల్లో మహిళా కాంట్రాక్టు లెక్చరర్లతో ధర్నాచౌక్ వద్ద నిరవధిక దీక్ష చేపట్టనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.ఎం. దయాకర్, కృష్ణంరాజులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు.
ఉద్యమంలో భాగంగా సెప్టెంబరు 26, 27 తేదీల్లో పోస్టుకార్డు ఉద్యమం, 29, అక్టోబరు 1న ట్విటర్ ఎస్‌ఎంఎస్‌లు, అక్టోబరు 2న అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల దగ్గర సత్యాగ్రహం నిర్వహించామన్నారు. 3, 4, 5 తేదీల్లో నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరై తమ నిరసన తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ధర్నా చౌక్‌లో మహిళా అధ్యాపకులతో నిరవధిక దీక్షలు చేసేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
