నేడు కిడారి, సోమా కుటుంబ సభ్యులను పరామర్శించనున్న సీఎం
Published: Friday September 28, 2018

అమరావతి/విశాఖపట్టణం: మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబ సభ్యులను శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరామర్శించనున్నారు. గత మూడు రోజుల క్రితం డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామదర్శిని కార్యక్రమానికి వెళుతున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టు నక్సలైట్లు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అయితే... ఆ సమయంలో సీఎం చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. కాగా... విదేశీ పర్యటనను ముగించుకుని చంద్రబాబు శుక్రవారం ఉదయం విజయవాడకు వచ్చారు. అనంతరం ఉదయం 10గంటలకు విమానంలో విశాఖకు వెళ్లిన అనంతరం అక్కడినుంచి హెలికాప్టర్‌లో అరకు చేరుకుంటారు. అనంతరం సర్వేశ్వరరావు, సోమా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
