భారత్‌ను చూసి నేర్చుకోవాలి
Published: Thursday September 27, 2018

భారత్‌లో అమలు చేసే క్రికెట్ విధానాలను పాక్ నేర్చుకోవాల్సి ఉందని ఆ జట్టు వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ అన్నాడు. ‘గట్టి జట్టును రూపొందించుకోవడానికి సమయం పడుతుంది. ఈ దశలో ఎదురైన పరాజయాలకు కంగారుపడిపోయి ఆటగాళ్లను మార్చకూడదు. భారీగా మార్పులు చేయాల్సి వచ్చినప్పుడు కొత్త క్రికెటర్లకు తగిన సమయం ఇవ్వాలి. కొత్త ఆటగాళ్లను తయారు చేయడంలో భారత్ అనుసరిస్తున్న పద్దతులను మనం నేర్చుకోవాలి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఉత్తమ జట్టు. కొత్త క్రికెటర్లలో మనం ఆత్మవిశ్వాసం కలిగించాల్సి ఉంటుంది’ అని మాలిక్ పేర్కొన్నాడు.
