కోర్కెలను తీర్చే రొట్టెల పండుగ

Published: Saturday September 22, 2018

నెల్లూరు: కోర్కెలను తీర్చే రొట్టెల పండుగ రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు గంధ మహోత్సవం నిర్వహించనున్నారు. తమ కోర్కెలను తీర్చుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు బారాషాహీద్ దర్గాకు తరలివస్తున్నారు. తొలిరోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చినట్టు అధికారులు అంచనావేశారు. తొలి రోజున వివాహం, ఉద్యోగం రొట్టెలకు డిమాండ్‌ ఏర్పడింది. ఆ రొట్టెల కోసం యువత ఎక్కువసేపు ఘాట్‌ల వద్ద వేచి చూశారు.