ఇసుకలో కూరుకుపోయిన వేట బోటు...మత్స్యకారులకు తప్పిన ప్రమాదం
Published: Thursday September 20, 2018

పాలకాయితిప్ప సమీపంలోని సముద్రతీరంలో మత్స్యకారులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాకినాడకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటాడుతూ పాలకాయితిప్ప వద్ద ఇసుక దిబ్బను వేట బోటు ఢీకొనటంతో పక్కకు ఒరిగి ఇసుకలో కురుకుపోయింది. వెంటనే మత్స్యకారులు గమనించి ఒడ్డుకు చేరారు. పాలకాయితిప్ప లోని మెరైన్ పోలీసులకు సమాచార మందిం చటంతో వెంటనే రెండు బోట్లతో ఇసుకలో కురుకుపోయిన బోటును లాగారు. మెరైన్ సిబ్బంది జిలాని, వెంకటేశ్వరరావు తదిత రులు మత్స్యకారులకు సహాయసహకారాలు అందించారు.
