ఊరు వాడ సంక్రాంతి సంబరాలు

అంబరాన్నిఅంటిన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు . పల్లెటూరులు అన్ని కలకలాడుతున్నాయి ఊరూవాడా పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. దేశవిదేశాల్లోని కూడా లుగు వారు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఊరూవాడా ఎక్కడ చూసినా పండుగ కోలాహలమే కనిపిస్తోంది. పండుగవేల సాంప్రదాయ క్రీడలు రంగురంగుల పతంగులు ముగ్గుల పోటీలు అందరిని ఉల్లాసపరుస్తున్నాయి.
విశాఖ ఆర్కీబీచ్లో కైట్ ఫెస్టివల్ అదుర్స్ అనిపించింది. కేరింతలు కొడుతూ చిన్నారులు గాలిపటాలను ఎగురవేశారు. వివిధ ఆకృతుల్లో ఉన్న పతంగులు పలువురిని ఆకర్షించాయి.
విశాఖ ఎంపీ హరిబాబు కార్యాలయంలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యాలయం ప్రాంగణంలో భోగిమంటలు, సంక్రాంతి ముగ్గులు, గంగిరెద్దుల కోలాహల, గాలిపటాల ఎగురవేత సందడిగా జరిగింది. పండుగ సంబరాల్లో ఎంపీ హరిబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో సంక్రాంతి సంబరాలు స్థానిక పోలీస్ గ్రౌండ్లో ఘనంగా జరిగాయి. ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఆడపడుచులు వేసిన రంగవళ్లులను అందరూ తిలకించారు. మంత్రి సునీత ముగ్గులు వేశారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దుల బండి ఎక్కి హల్చల్ చేశారు.
