పెనుకొండ ఆర్టీవో చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు
Published: Saturday September 08, 2018

పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్టీవో చెక్‌పోస్టుపై శనివారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ జయరాం రాజు ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో చెక్‌పోస్టు సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న రూ.10,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎంవీఐ మదుసూదన్, హోమ్‌గార్డు చాంద్‌బాషాను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
