నూజివీడు ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల ఆందోళన
Published: Monday September 03, 2018

నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో అధ్యాపకులు ఆందోళన బాట పట్టారు. ట్రిపుల్ ఐటీ స్థాపించినప్పటి నుంచి పనిచేస్తున్న బోధనా సిబ్బందిని రెగ్యులర్ చేసి, వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం హామీలు నెరవేర్చకుంటే విధులు బహిష్కరిస్తామని మెంటార్లు హెచ్చరించారు. అయితే సమస్యలపై ఆర్జీయూకేటీ అధికారులతో చర్చలు విఫలమవడంతో వారు నిరసనకు దిగారు. సోమవారం కాంట్రాక్ట్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తమ నిరసన తెలియజేశారు.
