సంక్రాంతి కుటంబంతొ గడపనున్న ఉపరాష్ట్రపతి
Published: Wednesday January 10, 2018

ఈ నెలన 11వ తేదీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు రానున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారయినట్లు స్వర్ణభారతి ట్రస్టు డైరెక్టర్ కోటేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11న మధ్యాహ్నం నెల్లూరు చేరుకుని వెంకయ్య తన స్వగృహంలో బస చేస్తారు. 12వ తేదీ ఉదయం వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం తమిళనాడు గవర్నర్ విద్యాసాగరరావుతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు స్వర్ణభారతి ట్రస్టులో స్వామి వివేకానందుడికి నివాళులర్పిస్తారు. 16వ తేదీ వరకు బంధుమిత్రులతో సంక్రాంతి సంబరాలలో పాల్గొంటారు.
