కరెబియన్ దీవుల్లొ భారీ భూకంపం - సునామి అవకాశాలు
Published: Wednesday January 10, 2018

కరేబియన్: సెంట్రల్ అమెరికాలోని కరీబియన్ దీవులలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.6 నుంచి 7.8 వరకు నమోదయింది. దీని ప్రభావంతో వర్జిన్, ఫ్యూర్టోరికో దీవులలో సునామీ వచ్చే అవకాశముందని సమాచారం , సుమారు మూడు అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడతాయని అమెరికా భౌగోళిక సర్వే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
భూప్రకంపనలు ధాటికి హోండ్యురాస్ రాజధాని టెగుచిగల్పాలో భవనాలు కుప్పకూలాయి. వృక్షాలు నేలకూలాయి. దీంతో ఆ దేశాధ్యక్షుడు జువాన్ ఓర్లాండో అత్యవసర పరిస్థితిని విధించారు. మెక్సికోలోని క్వింటానా రూ ప్రాంతంలోనూ ప్రకంపలు సంభవించాయి.
