సంక్రాతికి మూడు ప్రత్యెక రైల్లు : గుంటూరు
Published: Wednesday January 10, 2018

గుంటూరు మీదగా సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా మరో మూడు ప్రత్యేక రైళ్లనునడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో ఒకటి సువిధ రైలు ఉన్నది. నెంబర్ 02710 సికింద్రాబాద్ - గూడూరు ప్రత్యేక రైలు ఈ నెల 11వ తేదీన రాత్రి 7.15 గంటలకు బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి చీరాల, ఒంగోలు, నెల్లూరు మీదగా మరుసటి రోజు ఉదయం 6.40కి గూడూరు చేరుకొంటుంది. నెంబర్ 82711 నరసపూర్ - సికింద్రాబాద్ సువిధ ప్రత్యేక రైలు ఈ నెల 17వ తేదీన రాత్రి 9.10 గంటలకు బయలుదేరి గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదగా మరుసటి రోజు ఉదయం 8.25కి సికింద్రాబాద్ చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్, త్రీటైర్, స్లీపర్‌క్లాస్ భోగీలుంటాయి.
