నీటమునిగిన గోష్పాద క్షేత్రం
Published: Saturday August 18, 2018

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి గోష్పాద క్షేత్రం నీటమునిగింది. ఇప్పటికే పలు మండలాల్లో గోదావరి వరద రహదారులను ముంచెత్తడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా... గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పెనుగొండ, ఆచంట, యలమంచిలి, పోడూరు మండలాల్లోని పలు గ్రామాలకు పడవల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అలాగే జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతుండడమేగాక ఆహార పదార్ధాలను కూడా పంపిణీ చేస్తున్నారు.
