శంకుస్థాపన ఒకచోట నిర్మాణం మరోచోట
Published: Monday August 13, 2018

హిందూపురం: భవిష్యత్‌లో ఎప్పుడైనా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇక్కడ ఉన్న జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. ఆసుపత్రి స్థలం మరి కొద్ది రోజులు పోతే వచ్చే రోగులకు సరిపోయే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో ఆసుపత్రి ప్రధాన ద్వారంలో క్యాంటీన్ ఏర్పాటు పేరుతో కాంప్లెక్స్ నిర్మాణంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అన్న క్యాటీన్ నిర్మించక మునుపు రోగులకోసం ఆసుపత్రి అవరణంలో క్యాంటీన్ కోసం 2015లో అప్పటి ఆర్యోగ్య శా ఖ మంత్రి కామినేని శ్రీనివాసులుతో కలిసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమిపూజ చేశారు. అయితే వారు భూమిపూజ చేసిన చోటు వదిలేసి ఆసుపత్రిలో క్యాంటీన్ నిర్మాణం కోసమని ఆసుపత్రి ప్రధాన ద్వారంలో భవనం చేపట్టడంతో అనుమానాలకు తావిస్తోంది. ముందుగా భూమిపూజ చేసినట్లు చెబుతూ అన్న క్యాంటీన్‌ను వెనక్కి తో సి ముందర మరో రెండు కాంప్లెక్స్ నిర్మాణానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అన్నా క్యాంటీన్ ప్రారంభానికి సిద్దం చేయగా మరో క్యాంటీన్ నిర్మిస్తుండటం ఇది పక్కాగా దోపి డీ చేయడానికేనని చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ఆసుపత్రి ఆవరణంలో రెండేళ్ళకు పైగా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా భోజనాలు అందజేస్తున్నారు. ప్రధాన రహదారికి ఆనుకుని క్యాంటీన్ నిర్మాణంకు పనులు చేపడుతుండటంపై అందరి చూపు దీనిపైనే పడింది. అన్న క్యాంటీన్ ఎదుట నూతనంగా నిర్మిస్తున్న భవనం క్యాంటీన్‌కు కాకుండా వాణిజ్య సముదాయ కాంప్లెక్స్ భవనంగా ఉపయోగించుకుని లీజుద్వారా దోపిడీ చేసేందుకు కొందరు సన్నాహాలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
నిర్మిస్తున్న భవనం వాణిజ్య పరంగా మార్చుకుంటే సగటున నెలకు రూ.2 లక్షలు అద్దె చెల్లించే అవకాశాలు ఉన్నాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇన్ని క్యాంటీన్‌లు లేవని, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా ఓకే చోట క్యాంటీన్‌లు ఏర్పాటు చేయడం విడ్డూరంగా కనిపిస్తోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అన్నా క్యాంటీన్‌ను వెనక్కు నెట్టి ముందర మరో క్యాంటీన్ పేరుతో నిర్మాణంపై ఎమ్మెల్యే బాలకృష్ణ వద్ద చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఏపీఎంఎస్ఐడీసీకి క్యాంటీన్ నిర్మాణం చేసేందుకు అనుమతులు వచ్చాయి. అయితే జీఎస్టీ ప్రభావంతో అది కాస్తా ఆలస్యమైంది. దీంతో మరింత మొత్తం పెంచి క్యాంటీన్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ కేశవులు తెలిపారు.
