తాత్కాలిక హైకోర్టు ఎర్పాటుకు కమిటీ అమరావతి పర్యాటన

తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు కు నిర్మించిన కమిటీ పర్యటన చేసి తీసుకొనే నిర్ణయంపై ఏ భవనాలను తాత్కాలిక హైకోర్టుకు ఏర్పాటు చేస్తారనేది ఆధారపడి ఉంది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న హైకోర్టు విభజనకు ఇటీవలే సీఎం అంగీకారం తెలిపారు. ఇప్పటికే సీఎం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్‌కు లేఖ కూడా రాశారు. ఈ మేరకు భవనాలను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. వారం, పది రోజుల వ్యవధిలోనే కమిటీ అమరావతి రానున్నట్లు సమాచారం . గుంటూరు జిల్లా విషయానికి వస్తే అసలు తాత్కాలిక రాజధానినే ఏఎన్‌యూలో ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. అయితే దీని వలన యూనివర్శిటీలో విద్యా వాతావరణం దెబ్బ తింటుందని, సెంటిమెంట్‌రీత్యా ఆ ప్రతిపాదనను పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ వర్శిటీ చుటూచర్చలు జరుగుతున్నాయి.
వర్శిటీ అయితే గుంటూరు - విజయవాడ ప్రధాన రహదారికి సమీపంలోనే ఉన్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఈ ప్రాంతానికి సులువుగా చేరుకోవచ్చు. అంతేకాకుండా సమీపంలోనే ఐజేఎం విల్లాలు, లింగమనేని ఎస్టేట్స్ ఉన్నాయి. వీటిల్లో ఖాళీగా అపార్టుమెంట్ ప్లాట్లు, డ్యూప్లెక్స్ విల్లాస్ రెడీగా అందుబాటులో ఉన్నాయి. కొంతమంది మంత్రుల క్యాంపు కార్యాలయాలు కూడా ఇందులో ఏర్పాటు చేయటం జరిగింది .
ఇదే విధంగా గుంటూరు ఇన్నర్ రింగు రోడ్డు పరిసరాల్లో అపార్టుమెంట్ ఫ్లాట్‌లు బోలెడన్ని ఉన్నాయి. వాటిని లీజుకు ఇచ్చేందుకు గతంలోనే బిల్డర్లు సుముఖత కనబరిచారు. అలానే మంగళగిరి - తాడేపల్లి వద్ద కూడా భవన . సముదాయాలు తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు అందు బాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా న్యాయవాదులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాత్కాలిక హైకోర్టు గుంటూరులోనే ఏర్పాటు చేయాలని సమావేశాలు, చర్చలు నిర్వహిస్తున్నారు.
