టీడీపీ ఎంపీ నివాసంలో చోరీకి యత్నం
Published: Wednesday August 08, 2018

ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నివాసంలో చోరీకి విఫలయత్నం జరిగింది. జూబ్లీహిల్స్‌లో ఫ్లాట్ నెంబరు 538సీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ నివాసముంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి చిన్న నర్సింహ, పెద్ద నర్సింహ, అయ్యప్ప అనే ముగ్గురు భరత్ ఇంట్లో లేడు అనుకొని చోరీ చేసేందుకు ప్రయత్నించారు. ఇంటి వద్ద ఉన్న కాపలాదారుడు ఎం.వెంకయ్య వారిని గమనించాడు. గేటు దూకేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకున్నాడు. దీంతో ముగ్గురు అతన్ని తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలు కావడంతో వెంకయ్య అరవడంతో స్థానికులు మేల్కొని బయటకు వచ్చే సరికి ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడు వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
