ఆరోగ్యశాఖ కౌన్సెలింగ్ గందరగోళం
Published: Tuesday August 07, 2018

అమరావతి: సివిల్ సర్జన్ పదోన్నతి పొందిన వారికి పోస్టింగులిచ్చేందుకు ఆరోగ్యశాఖ నిర్వహించిన కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. తమకు అన్యాయం జరుగుతోందని కొందరు వైద్యులు సీఎం, మంత్రులు లోకేశ్, నక్కా ఆనందబా బులకు ఫిర్యాదులు చేసే వరకూ వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలను కౌన్సెలింగ్‌లో చూపించలే దని, మొదట చూపించిన 20 ఖాళీలను, కౌన్సెలింగ్ సమయానికి 16గా మార్చేశారని ఆరోపించారు. మరోవైపు అప్పటికప్పుడు కొన్ని పోస్టులను కౌన్సెలింగ్‌లోకి తీసుకొచ్చారని చెబుతున్నారు.
కౌన్సెలింగ్ అంతా అధికారులు ఇష్టారాజ్యంగా చేశారని, ఎక్కడా నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల డీఎంహెచ్‌వో పోస్టులున్నాయని మొదటి జాబి తాలో పెట్టార ని, శనివారం సాయంత్రానికి ఆ ఖాళీలు మొత్తం తొలగించి, శ్రీకాకుళం, కృష్ణా, చిత్తూరు జిల్లాల డీఎంహెచ్‌వో పోస్టులు మాత్ర మే చూపించారని చెబుతున్నారు. ఇప్పుడు అవి కూడా లేకుండా అదనపు డీఎంహెచ్‌వో పోస్టులు మాత్రమే చూపిస్తున్నారని విమర్శించారు. కౌన్సెలింగ్ మొత్తం రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని కోరుతున్నారు.
