జాబిత విడుదల : మంత్రి గంటా శ్రీనివాసరావు

Published: Monday January 08, 2018

రాష్ట్రంలో నిర్వహించే వివిధ సెట్ల పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చెసారు అమరావతిలో మీడియా సమావేశంలో మంత్రి గంటా మాట్లాడుతూ అన్ని సెట్లనూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, వారంలోపే ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు 115 నుంచి 150 వరకు సెంటర్లను ఏర్పాటు చేస్తామని గంటా ప్రకటించారు.తేదీల వివరాలు 

 

ఏప్రిల్ 19న ఎడ్‌సెట్, లాసెట్

ఏప్రిల్‌ 22 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష

ఏప్రిల్‌ 26న ఏపీ ఎంసెట్‌ మెడిసిన్‌ పరీక్ష

మే 2న ఐసెట్‌

మే 3న ఈసెట్‌

మే 4న పీయూ సెట్‌

మే 10 నుంచి 12 వరకు పీజీ సెట్

 

విశాఖలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను యూనిర్సిటీగా మార్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ యూనివర్సిటీకి అడ్మిషన్లు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి గంటా తెలిపారు.