సంక్రాంతికి పడవ పోటీలు
Published: Monday January 08, 2018

ఈ నెల 13, 14 తేదీల్లో నాగాయలంకలో రాష్ట్రస్థాయిలో పడవల పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి ప్రధాన కార్యదర్శి నాగాంజనేయులు తెలిపారు. ఆదివారం పోరంకి గంగూరు చాపల కుండీ సెంటర్‌లో ఉన్న రాష్ట్ర మత్స్యశాఖల అభివృద్ధి కార్యక్రమంలో కమిషనర్ రమాశంకర్ నాయక్‌ని కలిసి పోటీల పోస్టర్ విడుదల చేశారు. కమిషనర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ఏటా నాగాయలంకలో నిర్వహించే వేళ పడవ పోటీలు చాలా ఉత్సాహభరితంగా ఉంటాయని మత్స్య కారులకు ప్రోత్సాహ బహుమతులు అందిస్తామని చెప్పారు. నిర్వహణ కమిటీ సభ్యులు తిరుమలశెట్టి మస్తాన్‌రావు, నాగిడి తాతారావు, లంకా శ్రీనివాస ప్రసాద్, వాటిపల్లి బిక్షం పాల్గొన్నారు.
