నిరుద్యోగులకు ఫ్లిప్‌కార్ట్ సంస్థ.. బంపరాఫర్.....

నిరుద్యోగ యువకులకు తీపి కబురు తెలిపింది ఫ్లిప్‌కార్ట్ సంస్థ..మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉందా..మీరు పదోతరగతి పాస్ , ఫెయిల్ తో సంబంధం లేకుండా మీకు ఉద్యోగం ఇవ్వబోతుంది ఫ్లిప్‌కార్ట్ సంస్థ. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి కంప్యూటర్ ఆపరేటర్లు పోస్టులు 500 ఖాళీగా వున్నాయని తెలిపింది.
రవాణా, భోజన, వసతి సౌకర్యాలతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ అన్ని ఇస్తూ రూ.10 వేల జీతం ఇవ్వబోతుంది.ఈ
పోస్టులకు 18 నుంచి 32 ఏళ్ల యువకులు అర్హులని తెలిపింది.. ఆసక్తి గల నిరుద్యోగ యువకులు ఈ నెల 26, 27వ తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరింది. అభ్యర్థులు www.vzmcareers.com నందు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
నమోదు చేసుకున్నవారికి సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ ఇస్తారని తెలిపింది. ఇంటర్వ్యూకు విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు రెసిడెన్సీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకురావాలని డీఆర్ డీఏ పీడీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులు కేవలం విజయనగరం జిల్లా అభ్యర్థులకు మాత్రమే.
