కామాంధులకు కఠిన శిక్ష: అనంతపురం కొర్టు సంచలన తీర్పు

పసి బిడ్డ పరాయి బిడ్డ.. తన కన్న బిడ్డ.. అన్నది కూడా మరచి కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు ఒడిగట్టిన, అకృత్యాలకు పాల్పడిన మానవ మృగాలకు ఇది మరణ శాసనమే. ఒక్క రోజు కాదు.. రెండ్రోజులు కాదు.. వరుసగా మూడ్రోజులు.. అనంతపురం ప్రత్యేక కోర్టు ముగ్గురు కామాంధులకు యావజ్జీవ కారాగార శిక్షలు విధించి సంచలనం సృష్టించింది. తప్పు చెసిన వాలని కఠినంగా శిక్షించి కటకటాల్ వెనకకి నెట్టింది.
వివరాల్లొకి వెళ్తె: పసి పాపలు అని కూడా చూడకుండా అత్యాచారాలకు బరితెగిస్తున్న మానవ మృగాలపై అనంతపురం ప్రత్యేక న్యాయ స్థానం కఠినంగా శిక్షించింది. యావజ్జీవ కారాగార శిక్షలు విధించి , నెరస్థుల పని పట్టింది . ఈనెల 3 నుంచి వరుసగా మూడ్రోజులపాటు ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షలు విధించి, సంచలనం సృష్టించింది. వరుసగా మూడు రోజుల పాటు ముగ్గురు నిందితులకు వేర్వేరు కేసుల్లో వరుసగా శిక్ష విధించడం న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశమైంది. అందులోనూ బాలికలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కిందే కావటం గమనార్హం. ఇలా ఒకే రకం కేసుల్లో వరుసగా తీర్పులు రావటం ఇదే మొదటిసారని పలువురు న్యాయవాదులు పేర్కొంటున్నారు. బుధవారం బత్తలపల్లికి చెందిన శ్రీరాములు, గురువారం కంబదూరు వాసి రామాంజనేయులు, శుక్రవారం పుట్టపర్తికి చెందిన ముత్యాలుకు యావజ్జీవ కారాగార శిక్షలు విధించటం పట్ల బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేరాల్లో కఠిన శిక్షలు పడితేనే నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. బాధితుల పక్షాన కేసులను వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుడేన్‌సాబ్‌ను న్యాయవాదులను, బాధితులు అభినందించారు.
దళిత బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు కురుమల చిన్న ముత్యాలుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ స్థానిక అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది. పుట్టపర్తికి చెందిన కురుముల చిన్న ముత్యాలు అక్కడే మండల పరిషత్ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. పాఠశాలలో అదే గ్రామానికి చెందిన దళిత బాలిక నాలుగో తరగతి చదువుతూ, హాస్టల్‌లో ఉండేది. 2015 సె ప్టెంబర్ 14న మధ్యాహ్నం పాఠశాల ముగిశాక బాలిక సోదరితో కలిసి ఇంటికి బయల్దేరింది. చెప్పులు మరచిపోవటంతో వెనక్కి వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న చిన్న ముత్యాలు బాలికను బాత్‌రూమ్‌లోకి లాక్కెళ్లి, లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక విషయాన్ని హాస్టల్ వార్డెన్, ఇంట్లో తల్లికి తెలిపింది. మరుసటి రోజు ఉదయం పుట్టపర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. విచారణలో భాగంగా కోర్టు 12 మంది సాక్షులను విచారించింది. నిందితుడిపై నేరం రుజువవటంతో యావజ్జీవ కారాగార శిక్ష, రూ.50 వేల జరిమానా, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద మరో రూ.50 వేల జరిమానా, అత్యాచారానికి ఐదేళ్ల జైలు, మరో రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో ఒక్కో కేసుకు ఆరునెలల చొప్పున జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
