నిస్సహాయ స్థితిలో ఉన్నస్టీల్ ప్లాంట్ ఉద్యోగిని ఆదుకున్న'' శ్రీ కృష్ణ దేవరాయ సంక్షేమ సేవా సం
Published: Saturday July 14, 2018

విశాఖపట్నం : శ్రీ కృష్ణ దేవరాయ సంక్షేమ సేవా సంఘం గాజువాక నియోజకవర్గ సంఘం అధ్యక్షుడు జెర్రిపోతుల ముత్యాలు,
మరియు కె. ఎన్. ఆర్. ఫౌండేషన్ చైర్మన్ కరణంరెడ్డి నర్సింగరావు ఆధ్వర్యంలో డొంకాడ కాలనీ, అగనంపూడి గ్రామం లో ఇటీవల స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తూ ప్రమాదానికి గురై వెన్నుముక, కాళ్లు తీవ్రంగా దెబ్బతిని మంచానికి పరిమితం అయిన ఇల్లపు.రమణని పరామర్శించి కొంత ఆర్థిక సహాయంతో బాటు బియ్యం, కిరాణా సామాన్లు అందించారు, రమణ స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డు పై అన్ని టెస్టులో పాస్ అయి, రేపు మెడికల్ టెస్ట్ అనంతరం ప్రభుత్వ ఉద్యోగం లో జాయిన్ అవుతాననగా, ఈ ప్రమాదం దురదృష్టవ సాస్తు జరిగిందని , 2 నెలలు ఫిజియోధెరఫీ చేస్తే నడుము, వెన్నుముక సరి అవుతాయని డాక్టర్లు చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు, అందుకు రోజుకి 1,000/- వెయ్యి రూపాయల మేరకు ఖర్చు అవుతుందని తెలియడంతో , మేము కొంత సహాయం చేస్తామని, ఇంకా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు శ్రీ కృష్ణ దేవరాయ సంక్షేమ సేవా సంఘం సభ్యులు .
ఈ కార్యక్రమంలో బొండా. యల్లాజీరావు, శ్రీ దేవి, సత్యారావు, కట్టా. అప్పారావు, శ్రీనువాస రావు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు
